పక్షులకు
పాత కొత్త పరిచయాలు ఉండవు.
ప్రతి పక్షి పాతదే ప్రతి పక్షి కొత్తదే!!
పక్షులకు సమస్త పక్షులు నేస్తాలే!!
పక్షులకు అరుపులే జాతి చిహ్నాలు
దారి చూపే మార్గాలు.
చీకటికి ముందు చీకటి వీడే కన్న ముందు
పక్షుల అరుపులు వినిపిస్తాయి.!!
బడి ఒక చెట్టు
ఆ చెట్టుపై పక్షులు పాఠశాల విద్యార్థులు.!!
పాఠాలు ఆటలు పాటలు ఒకవైపు
అరుపులు ఒకవైపు
గెలుపు ఓటములు ఒకవైపు
కలుపు మొక్కల్లా అరుపులు ఒకవైపు
చీకటి వెలుగులు ఒకవైపు
శిక్షణా క్రమశిక్షణ మరోవైపు.!!
అయినా
ఉపాధ్యాయులు ఎన్ని యుద్దాలైన గెలుస్తారు.
బడి ఎప్పటికీ ఓడిపోదు.
బడిని ఎప్పటికీ వీడిపోరు విద్యార్థులు!!
ఎప్పటికైనా పక్షులు
ఆకాశంలో ఎగురుతాయి!!!
ఎగిరే పక్షుల అరుపులు ఆగిపోతాయి.!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి