పాదముద్రలు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఒక పరమార్థం 
మనను సజీవంగా ఉంచుతోంది
అది నెరవేరగానే
మరో పరమార్ధం కోసం
మన రూపాన్ని 
మరో రూపంలోకి మార్చి
ఈ విశ్వం
మనను ప్రయాణం చేయిస్తుంది
మన నడవడి,మన చరిత్ర
మన సంఘర్షణకి 
సాక్ష్యాలుగా మిగులుతాయి
ఇవే
మనం
ఈ ప్రపంచంలో వదిలి వెళ్ళే 
మన పాద ముద్రలు !!
**************************************

కామెంట్‌లు