గుప్తుల కాలంలో నాణేలు ఉన్నా యని చరిత్ర చెప్తోంది.కానీ రుపయా రూపాయి అనే వెండి నాణాన్ని తొలి సారి అమల్లోకి తెచ్చింది మాత్రం షెర్షా సూరి అనే పాలకుడు.1486 లో బీహార్ లోని సాసారామ్ అనే ప్రాంతం కి జాగీరు దారైన హసన్ ఖాన్ ఇంటపుట్టాడు.అసలుపేరు ఫరీద్.ధైర్యసాహసాలున్నవాడు అనే అర్థం లో షేర్ ఖాన్ అనే బిరుదు పొందాడు.మొగల్ సైన్యం లో చేరి బాబర్ తో కల్సి యుద్ధాల్లో పాల్గొన్నాడు.కానీ బాబర్ కొడుకు హుమాయూన్ ని ఓడించి షెర్షా తన సూర్ వంశపాలన కి బీజం వేశాడు.కొంతకాలమే పాలించినా కూడా
వెండి నాణాలు ప్రవే
శ పెట్టాడు.దామ్ అనే రాగి నాణాలు మొహర్ అనే బంగారు నాణాలు అమల్లోకి తెచ్చాడు.వెండిది ఒక రూపాయి తులం బంగారం దిమొహర్ గా చెలామణి అయినాయి.16 రూపాయలు అంటే ఒకమొహర్.మొగల్ పాలకులు కూడా ఆనాణాలనే తమ పాలనలో కొనసాగించటం విశేషం.మొగలాయీ పాదుషా అక్బర్ ఇలాహీ అనే పేరుతో బంగారు నాణాలు అమల్లోకి తెచ్చాడు.దానివెల 10రూపాయలు.మొగల్ బంగారు నాణెం శహంశాహ్ పైఫారశీ పేరుండేది.జహంగీర్ కాలంలో కొన్ని నాణాలపై రాశిచక్రం చిహ్నం తో ఉన్నవి అమూల్య సంపద గా భావించేవారు.కొన్నింటిపై భార్య నూర్జహాన్ పేరు ముద్రించాడు. తక్కువ కాలంలో మంచి కీర్తి సంపాదించిన ఘనత షెర్షా సూరి దే 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి