చినుకుగా నేలకు వచ్చే
నీటిదెంత సంబరమో!
చిత్తడిగా పుడమిని తడిపే
వానదెంత ఔదార్యమో!
ఏ చినుకు ఎవరికి వరమై
ఏ కబురు తెచ్చేనో!
ఏ చెమ్మ ఎవ్వరి మదిలో
ఏ మమతను కరిగించేనో!
ఏ చివురుకు కొత్త ఊపిరిగ
ఏ కొమ్మను అలరించేనో!
ఏ పువ్వుకు ముద్దును అద్ది
ఏ రేకుపై ముత్యమయేనో!
ఏ మొక్కకు ప్రాణం పోసి
ఏ మొక్కును తీర్చేనో
ఏ జీవికి దాహం తీర్చి
ఏ దీవెన పొందేనో!
ఏ ధారలో కలిసిపోయి
ఏ కోనలో సాగేనో
ఏ వాగుగ నదిని చేరి
ఏ చేనిని తడిపేనో!
ఏ నేలకు జీవం పోసి
ఏ పంటకు కారణమౌనో
ఏ కష్టానికి ప్రతిఫలంగా
ఏ కడుపును నింపేనో!
ఏ కన్నీటికి చల్లగ తోడై
ఏ వేదన కరిగించేనో
ఏ మదిలో వెతలో కదిల్చి
ఏ హృధికి బరువు దింపెనో!
ఏ మబ్బులు ఎంత కమ్మినా
ఏ వానలు ఎంత కురిసినా
వేకువ రాక ఆగదు
వెలుతురు తేక మానదు
కలతల మబ్బులు తొలగించే
కమ్మని ఉదయానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి