నల్లసూరీడుగా ఖ్యాతి గాంచిన నెల్సన్ మండేలా జీవితంలో జరిగిన సంఘటన ఇది...
మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయిన తర్వాత ఓరోజు తన ఎస్కార్టుతో కలిసి రెస్టారంట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు. రెస్టారంట్లో ఓ చోట కూర్చున్నారు. తనతో వచ్చిన వారిని ఏం కావాలో చెప్పమని మండేలా అడిగాడు.
ఇంతలో అక్కడ పక్కనున్న టేబుల్ దగ్గర, ఒక పెద్దాయన భోం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనిని మండేలా గుర్తుపట్టాడు.
అప్పుడు మండేలా తన సైనికులలో ఒకరిని ఆ పెద్దాయన దగ్గరకు పంపించి అతనిని కూడా తమతో కలిసి భోంచేయడానికి తీసుకురమ్మన్నాడు.
సైనికుడు వెళ్లి మండేలా ఆహ్వానాన్ని అతనితో చెప్పి తీసుకొచ్చాడు. అతను లేచి తన ప్లేటుతో సహా మండేలా బృందంతో కలిశాడు. మండేలా తన పక్కనే కూర్చో పెట్టుకున్నాడు.
అయితే మండేలా పక్కన ఉన్నంతసేపూ పెద్దాయన చేతులు వణుకుతూనే ఉన్నాయి. సరిగ్గా తినలేకపోయాడు. వంచిన తలపైకెత్తలేదు. ఎట్లాగో భోజనం అయిందనిపించుకున్న ఆ పెద్దాయన మండేలా వైపు చూడకుండానే వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. మండేలా అతనితో కరచాలనం చేశాడు.
అనంతరం మండేలా ఎస్కార్టులో ఒక సైనికుడు ఇలా అన్నాడు...
"అతనికి ఆరోగ్యం బాగున్నట్లు లేదు. తింటున్నంత సేపూ అతని చేతులు వణుకుతూనే ఉన్నాయి. చూసేరా" అని.
అప్పుడు మండేలా "అతనికే ఆరోగ్య సమస్యా లేదు. అయితే అతని చేతులు వణకటానికి మరొక కారణం" ఉందంటూ తన మాటలు కొనసాగించాడు....
"నేను జైల్లో ఉన్నప్పుడు అతనే జైలు వార్డెన్. అతనొక రోజు నన్ను మాటల్లో చెప్పలేనంతగా వేధించినప్పుడు దాహంగా ఉందని తాగడానికి నీళ్ళు కావాలని అడిగాను. ఏడ్చాను. కానీ అతను నీరివ్వకపోగా నన్ను మరింతగా అవమానపరిచాడు, నన్ను చూసి వికటాట్టహాసం చేసాడు. అంతేకాదు, అతను నా తలపైన మూత్ర విసర్జన చేశాడు. ఇప్పుడతను నన్ను గుర్తుపట్టాడు. అతనికి ఏ అనారోగ్యమూ లేదు. నేనిప్పుడు దేశాధ్యక్షుడ్ని కదా. నన్ను ఆరోజు జైల్లో వేధించినందుకు ప్రతీకారంగా ఇప్పుడతనిని జైలుకు పంపిస్తానేమోనని అతను లోలోపల భయపడుతున్నాను. ఆ భయంతోనే అతని చేతులలా వణికాయి. నా వంక చూడలేకపోయాడు. కానీ నేను అతననుకుంంటున్నట్లు ప్రతీకారం తీర్చుకోను. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే మనస్సులు ప్రాంతాలను నాశనం చేస్తాయి. అలాకాకుండా సయోధ్యను కోరుకునేవారు దేశాలను నిర్మిస్తారు. నా స్వేచ్ఛకు రెక్కలొచ్చిన నేను కోపం, ద్వేషం, పగవంటివన్నీ వదిలిపెట్టకపోతే, నేనింకా ఖైదీగా ఉన్నట్లే లెక్క. ప్రస్తుతం నాకు నా దేశం నా ప్రజలు ముఖ్యం" అని నెల్సన్ మండేలా చెప్పాడు.
నెల్సన్ మండేలా (జననం 18 జూలై 1918 - మరణం డిసెంబర్ 5 , 2013) 1994 నుండి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు. ఆయన మొట్టమొదటి నల్లజాతి అధినేత. పూర్తి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ఎన్నికలలో ఎన్నికైన మొదటి వ్యక్తి. ఆయన ప్రభుత్వం జాతి సయోధ్యను పెంపొందించడం ద్వారా వర్ణవివక్ష వారసత్వాన్ని విచ్ఛిన్నం చేయడంపై దృష్టి పెట్టింది. సైద్ధాంతికంగా ఆఫ్రికన్ జాతీయవాది. సామ్యవాది. ఆయన 1991 నుండి 1997 వరకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ణవివక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మండేలాను 1962లో అరెస్టు చేశారు. విచారణ తరువాత ఆయనకు జీవిత ఖైదు విధించారు. 27 ఏళ్ళపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి