సుప్రభాత కవిత ; -బృంద
వెలుగుల వానలొ తడవాలనీ
కొత్తగ లోకం చూడాలనీ
మత్తుగ విప్పిన రేకుల రెప్పలకు
నులివెచ్చగ తాకిన కిరణం

ప్రాగ్దిశ  యవనిక పైన
ధగ ధగ మెరిసే బింబం
గగనపు ముంగిట ఒలికిన
జ్యోతి కలశపు కాంతిపుంజం

ఆకాశాన అనుదినమూ
ఆవిర్భవించే  అద్భుతం
అందరినీ కనుసన్నల నిలిపి
ఆదరించే  తండ్రివంటి దైవం

పసిడి వెలుగులో పుడమి
పసిపాపగ నవ్వెను స్వచ్ఛంగా
అంతా తానై కాచుకునే
రక్షకుని నీడను నిశ్చింతగా..

అద్దమంటి మనసులోన
అరమరికరలు లేక
అందరినీ  తనవారిగా
భావించు గుణమెంత మిన్నో!

అహంకారం వదిలేసి
మమకారం పెంచుకుని
సహకారం పంచుకోమనే
ప్రకృతి ఇచ్చే సందేశం..బ


అందుకుని బ్రతుకమని
మార్చుకునే దిశగా
అడుగులు వేయించే
అతిశయమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు