శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా
--------------------
మహావిష్ణువు మానవుడిగా
మధురానగరిలో చెరసాలలో
శ్రీ కృష్ణ పరమాత్మ జననం
కంసమామకు మరణ యోగం!!
శ్రావణమాసం కృష్ణపక్షం
అష్టమీ సంతానంగ
అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో
అష్టమ సంతానంగా
దేవకీ గర్భాన జననం
అష్టమ భార్యలను చేపట్టిన వైనం!!
ఖరము కాళ్లు పట్టుకొని
బుట్టలోని పసివాణ్ణి
యమునానదిని దాటించి
యశోదకు అప్పగించిన తండ్రి
బిడ్డ క్షేమమే శ్రేయోదాయకం!!
నల్లనిరూపు వాడు
చల్లని చూపుల వాడు
ఉల్లాసంగా వుంటూ
ఉల్లాన్ని కొల్లగొట్టు వాడు
రేపల్లె కనుల పంట
మల్లె మనసు వాడు
మెల్లగా కొంటెపనులు చేయువాడు
పిల్లవాడే కాని పిడుగు వాడు!!
మధురానగరిలో మధుర భావనలో తేలియాడిన గోపికాజనము
వేణువు నూద మూగెడు వారు
మదిమదిలో ప్రేమతత్వం
ఆదమరచి ఆడెడి వారు
బృందావనిలో బృంద గానము
మధురలో నిండిన వేణు నాదం
మధురభక్తిని చాటిన వైనం!!
శ్రీకృష్ణుని రాసలీలలు
రాధ మనసునిండా చిన్ని కృష్ణుడు
విన్న వారికి కన్నవారికి
తొలగును జన్మ దారిద్య్రం!!
కర్మ విలువను తెలుప
గీతను బోధించిన జగద్గురువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి