భూమాతను
పూజించా
ఖాళీస్థలమును
పుచ్చుకున్నా
మేఘాలను
తీసుకొచ్చా
రాళ్ళగాపేర్చా
గోడలుకట్టా
నింగిని
పట్టుకొచ్చా
కప్పుగాకప్పా
ఇంటినిచేశా
వెన్నెలను
వెంటతెచ్చా
ఇంటిలోనిలిపా
వెలుగులుచిమ్మించా
తారకలను
ఏరుకొచ్చా
గృహమందు
వ్రేలాడతీశా
తోటలోకి
వెళ్ళా
పూలనుతెచ్చా
ఇంటిలోపరచా
అడవికి
పోయా
మొక్కలనుమోసకొచ్చా
ఇంటిచుట్టూనాటా
హిమగిరులని
సందర్శించా
గంగనుతెచ్చా
గృహములోనిర్బంధించా
స్వర్గానికి
యాత్రకెళ్ళా
అప్సరసనుతోడుతెచ్చుకున్నా
ఇంటిలోపెళ్ళాడా
ఇంటిని
అలంకరించా
ఇల్లాలితో
కాపురంపెట్టా
ఊహలపల్లకిని
అధిరోహించా
పన్నీటిచుక్కలను
కాగితాలపైచల్లా
ఆలోచనలను
వ్యక్తీకరించా
భావాలను
పుటలకెక్కించా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి