కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీము (UPS) ఎట్టి పరిస్థితిల్లో ఆమోదయోగ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఎపియుటిఎఫ్) జిల్లా కార్యదర్శి బోడ శ్రీను అన్నారు. కొత్తూరు మండల శాఖ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో యూటీఫ్ రాష్ట్ర నాయకులు దండు ప్రకాశరావు, మండల అధ్యక్షులు, కె.విజయ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎ.శోభన్ బాబులు పాల్గొని ప్రసంగించారు. కొత్తూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద యుపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
గత ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో తెచ్చిన జిపిఎస్ విధానాన్ని నిరసించీ పాత పెన్షన్ విధానానికే కట్టుబడియున్నామని వెల్లడించిన విషయాన్ని వారు గుర్తుచేసారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోగా దాని స్థానంలో యుపిఎస్(UPS) విధానాన్ని తీసుకురావడమనేది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసగించడమేనని, అందుకే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ వై.అనంతకుమార్ కు అందజేసారు.
ఈ నిరసన కార్యక్రమంలో యుటిఎఫ్ నేతలు బోడ శ్రీను, కె.విజయకుమార్, ఎ.శోభన్ బాబు, దండు ప్రకాశరావు, బి స్వర్ణలత, టి.గణపతి, భద్రయ్య, భుజంగరావు, టి.రవి, ప్రసాద్, బి.గణేష్, పి.దినేష్, ఉమామహేష్, పి.ధనంజయరావు, పి.బాలరాజు, కె.చంద్రరావు, రమేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి