శా0తి కోసం సమరం చెయ్యాల్సిన దుస్తితి..! ;- ..... కోరాడ నరసింహా రావు
అశా0తి , అలజడి కారు మేఘాల్లా భూగోళమంతా అలుముకున్నై ..! 

ఎక్కడ చూసినా... అభద్రతా భావమే...! 

మనిషిని చూసి... మనిషే భయపడేకాలం దాపురించింది

మనము, మనది అని... 
పదుగురూ కలిసి పంచుకు తిని బ్రతికే రోజుల్లో లేదీ భయం...! 

నేను- నాది అంటూ దోచు కోవటం, దాచుకోవటం మొదలు పెట్టిన నాటి నుండే ప్రారంభ మైంది ఈ భయం..!! 

ఇది మనుషుల్ని కులాలుగా విడదీసింది... 
 మతాలుగా వేరు చేసేసింది... 
 ప్రాంతాలుగా వేరు చేసేసింది... 

వర్గాలుగా విభజించేసింది...!! 
 కూటమిలుగా తయారు చేసిం ది..! 

మనిషి మానవత్వాన్ని నమ్మ లేక... మారణాయుధాల్ని ఆశ్రయిస్తు న్నాడు..! 

వెయ్యేళ్ల అభివృద్దిని ఒక్క యుద్దంతో నామరూపాల్లేకుం డా చేసేస్తున్నాడు..! 

ప్రకృతి వైపరీత్యాలకూ పరోక్ష కారకుడూ మనిషే ఔతున్నాడు..!! 

ప్రాణికోటి సమస్థములో సర్వో త్తము డనిపించుకున్న వాడు పరమనికృష్టునిగా తయారై నాడు..! 

ఓ మనిషీ... నిన్ను నువ్వు తెలుసుకో...! 
  నీలో ప్రవేసించిన స్వార్ధ భూతాన్నితరిమివెయ్... 
 నీ సహజ లక్షణములైన జాలి, దయ, ప్రేమ, సేవ, త్యాగ బుద్దులను మేల్కొల్పు
 శా0తిస్థాపన గావించు... 
  ఈ భూగోళాన్ని ఆనందసుమ నందనవనంగా ఆహ్లాద పరచు
      ******


కామెంట్‌లు