ఆదర్శ స్ఫూర్తి ప్రదాతలు 44 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 93ఏళ్ల వయసులో కూడా రోజూ140కి.మీ.ప్రయాణం చేస్తూ ఫిజిక్స్ బోధించేవారు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ గారు. మచిలీపట్నం లో జన్మించిన ఆమెకు ఐదునెలల వయసులో తండ్రి మరణించారు. తల్లి వనజాక్షమ్మ 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి మదనపల్లె లో బడి వైజాగ్ లో  ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ పొందారు. బి.ఎస్సీ ఆనర్స్ చేసి ఆంధ్రాయూనివర్శిటీలో డి.ఎస్సీ.  ఆపై ఫిజిక్స్ లెక్చరర్ గా 1989 లో రిటైర్ అయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వశాఖల్లో పరిశోధనాత్మక ఇన్ ఛార్జ్ గా పనిచేశారు. దాదాపు ప్రపంచ యాత్ర చేశారనే చెప్పవచ్చు. భర్త కీ.శే.చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. రెండు మోకాళ్ళ కి ఆపరేషన్ ఐనా మొక్క వోని ఆత్మ విశ్వాసం తో క్లాస్ కి ఠంచన్ గా అయ్యేవారు.    4గంటలకే నిద్ర లేచి విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లి సెంచూరియన్ యూనివర్సిటీ లో రోజు కి 6 క్లాసులు తీసుకునే వారు.ప్రపంచంలో పెద్ద వయసు ప్రొఫెసర్ శాంతమ్మ గారు. సొంత ఇంటిని వివేకానంద మెడికల్ ట్రస్ట్ కి ఇచ్చేశారు.ఆతల్లికి వందనాలు శుభాభిచందనాలు🌷
కామెంట్‌లు