స్ఫూర్తి ప్రదాతలు 45 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 అంతుబట్టని అనారోగ్యం సర్జరీ లతో ముంబైలో బి.ఆర్క్ చేసే కావ్యపూర్ణిమ ఎలాగో కోర్సు పూర్తి చేసింది. దృష్టి లోపం తో సమస్యలున్నా ఎన్.సి.పి.ఈ.డి.పి.కి సెలక్ట్ అయింది. ఐఐహెచ్ వారియర్స్ ఇండియా గ్రూప్ నిర్వహిస్తోంది.
మహారాష్ట్ర కి చెందిన రేఖాచౌధురి గిరిజన పల్లెలో పుట్టింది. మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధించింది.18 ఏళ్ల కే పెళ్లి  ఇద్దరు పిల్లలు. బ్యూటీపార్లర్ ప్రారంభం చేసి  ఇంగ్లీషు ఫ్రెంచ్ నేర్చుకుంది. జెప్ ఫౌండేషన్ నెలకొల్పింది. గ్రామం లో వనితలకు    ఆరోగ్యంపై అవగాహన తోపాటు 60వేలమందికి ఉపాధి కల్పించారు. 
ఖాళీ కొబ్బరి చిప్పల్తో రకరకాల పాత్రలు తయారు చేసి  విదేశాల్లో అమ్ముతోంది.కేరళ కి చెందిన మరియా కురియకోజ్ లక్షల జీతాన్ని వదిలేసి  పర్యావరణ పరిరక్షణ కు నడుంకట్టారు

కామెంట్‌లు