దివ్యాంగులు పారా ఒలింపిక్స్ లో పతకాలు పండిస్తుంటే మనం చిన్న పనులు కూడా చేయకుండా బద్ధకం స్మార్ట్ ఫోన్ టి.వి.కి అతుక్కు పోవటం బాధాకరం.కనీసం వినాయక చవితి రోజు ప్రతినబూనాలి పూజతో పాటు కృషి చేస్తాం అని.జీవాంజి దీప్తి మానసిక వైకల్యం పేదరికం తో బాధపడుతున్నా కూడా పారిస్ పారా ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కి తొలి కాంస్యం అందించింది.
హైదరాబాద్ కి చెందిన ధనుష్ ధనుష్ ప్రపంచ బధిరుల ఛాంపియన్ షిప్ లో రెండు బంగారు పతకాలు పొందాడు.
పారా బాడ్మింటన్ లో కాంచీపురం కి చెందిన తులసి మతికి ఎడం చెయ్యి పని చెయ్యదు.గోపీచంద్ అకాడమీ లో శిక్షణ పొంది ఇప్పుడు సింగిల్స్ లో రజితం పొందిన ఈమె వెటర్నరీ సైన్స్ చదువు తోంది.మనీషా రాందాస్ కుడిచెయ్యి పని చెయ్యదు.పిన్నవయసులో బెస్ట్ పారాఫిమేల్ అవార్డు కాంస్యం అందించింది పారిస్ లోగర్భవతి( రెండో సారి)31 ఏళ్ల జోడి గ్రిన్ హామ్ 7వనెల గర్భంతో పారిస్ పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి వనిత.కాంస్యం సాధించిన ఆమె కి జేజేలు.పారిస్ పారా ఒలింపిక్సు లో పొట్టికాలితో పుట్టిన ప్రవీణ్ కుమార్ హైజంప్ లో బంగారు పతకం తో అందరినోళ్లు మూయించాడు.బాల్యం లో వెక్కిరింపులు కొక్కిరింపులతో మనసు బాధపడింది. ఐనా కృషి తో వెండితో టోక్యోలో మెరిసిన యు.పి.కి చెందిన ఈకుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలిచారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి