చుక్కల ముగ్గు నీలాకాశం చూసే కిందకు
ఎగిరే చిరునవ్వు రెక్కల భూమి పైన
నడుమ దృశ్యం బతికిన ప్రకృతి
కష్టసుఖాల ఊపిరి చౌరస్తా
మట్టి పొత్తిళ్ళ మూలాలే నుడికారం
ఆత్మీయ భాష నేర్పింది అమ్మ వొడి
నాడి మీటిన జీవితమంతా
కరెంట్ ప్రసరించే ఆకుపచ్చ కవాతు
అమ్మ నిమిరిన తల నవ్వింది
కట్క నొక్కితే కరెంటు వెలిగినట్టు
రంగుల కాన్వాస్ పై జీవించే భూమి అనువంశికం
త్యాగాల రక్తదాత తల్లి ప్రేమైనా అద్భుత సంవేదన
నవ్వు చూపే అద్దం కోసం జనని పురుడు పోసుకున్నది ప్రాణాలను జనన మరణ యజ్ఞంలో
బతుకంతా కలల కన్నపిల్లల లోకం
మమతల మల్లెల కాంతి కళ వికసిత పరిమళం
నింగీ నేలను కలిపిన వంతెన
మనిషి
స్వేచ్ఛ ఎగిరే పతంగం వికసిత మానవత్వ సంతకం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి