తీపి తెలుగు పదాలు;- -గద్వాల సోమన్న,9966414580
 మేలు కాదు అల్ప బుద్ధి
చేసుకొమ్ము హృదయ శుద్ధి
దిద్దుకున్న జీవితాన
ఉండునోయి మిగుల వృద్ధి

మంచితనం మేలు మేలు
కలిగియున్న చాలు చాలు
క్షమాగుణం బహు గొప్పది
లాభాలే వేనవేలు

చెడ్డ బుద్ధి హానికరం
దొడ్డ బుద్ధి దైవ వరం
కలసిమెలసి ఉంటేనే
సృష్టిలోన మనోహరం

గుండెలోని చింత ముప్పు
తగలబెట్టు  చింత నిప్పు
ఆదిలోన వదిలేస్తే
సదా అదే కదా ఒప్పు

ఇంటిలోన వెలుగు తల్లి
ప్రేమలోన కల్పవల్లి
సేవలోన త్యాగమూర్తి 
గుబాళించే సిరిమల్లి

ఫలములిచ్చు మహిని తరువు
జ్ఞానమిచ్చు మనకు గురువు
పుస్తకాల పఠనంతో
ఎన్నెన్నో మేళ్ళు కలవు


కామెంట్‌లు