యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!
యత్రైతాస్తు నపూజ్యంతే/సర్వాస్తత్రాఫలాక్రియః
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో,అక్కడ దేవతలు నివసిస్తారు అన్నది పై వాక్యం యొక్క అర్ధం .స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం అని వేదం స్పష్తంగా చెబుతోంది ప్రహ్లాదుడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృ భావము జొచ్చి మరలువాడు అని పోతన వివరిస్తాడు. సీతని పరాభవించి రావణుడు, ద్రౌపదిని అవమానపరచి కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. ఒక వ్యక్తి అని కాకుండా స్త్రీ అనే దృష్టితో తక్కువగా చూసిన వారందరు నశించినట్టు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఒక స్త్రీని మోసం చేసి ఎత్తుకు వెళ్ళిన కారణంగా రావణుడు బంధు మిత్రులతో , పరివారంతో పాటు నశించాడు. ఇష్టం లేదన్నా వినక రంభను విసిగించినందుకు రావణుడు శాపానికి గురి అయ్యాడు.
ఒక స్త్రీని జుట్టు పట్టుకుని అవమానించిన కారణంగానే కౌరవ వంశం, అంటే, ధృత రాష్ట్రుని సంతతి అంతా నశించింది. ఇష్టం లేని స్త్రీని బలవంతంగా కోరినందుకు కీచకుడు తమ్ములతో పాటుగా దుర్మరణం పాలయ్యాడు.సన్న్యాసం స్వీకరించిన పీఠాధిపతులు కూడా స్త్రీలను గౌరవించే సంప్రదాయం సామాన్య ప్రజలకు తెలియ చేయటానికి ప్రతి రోజు తమ నిత్య పూజ పూర్తి అయిన తరువాత ఒక ముత్తైదువను పూజించి, నమస్కరించి కాని భిక్షను స్వీకరించరు. పెద్దలు చెప్పిన దానికన్న చేసిన దానిని చూసి నేర్చుకునేది ఎక్కువ కదా!ఆడవారి పాత్ర సమాజంలోనూ, ఇంట్లోనూ ఎంతో ఉన్నా ఆడవారిని గౌరవించకపోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. తగిన గుర్తింపు అనేది ఉండదు ఆడవారికి. తన కుటుంబం కోసం చేసిన పనికి గుర్తింపు ఏంటి అని చాలామంది అనుకుంటారు కానీ గుర్తింపు అంటే ఆ వ్యక్తిని గౌరవించినట్టు అనే విషయాన్ని మరవకూడదు. అందుకే ఆడవారికి గుర్తింపు ఇవ్వడమంటే వారి కష్టాన్ని గౌరవించినట్టు అని అర్థం.ఏ స్త్రీ అయినా పొరపాటున కూడా ద్వేషం తెలియజేస్తూ శాపం పెట్టరాదు. ఎందుకంటే ఆడపిల్ల శాపం పెట్టిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా గొడవ పడే ఆడపిల్లలుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కుమార్తెలు లక్ష్మీ దేవి స్వరూపం. వారి ఆనందం ఇంటికి మంచిది. ఆడవారి కన్నీళ్లు ఆ ఇంటికి మంచిది కాదని అంటారు.స్త్రీలు సంతానం ద్వారా ఇంటికి అదృష్టాన్ని తెస్తారని అర్థం; వారు గౌరవం మరియు గౌరవానికి అర్హులు; వారు తమ ఉనికితో ఇంటిని రేడియేట్ చేస్తారు. నిజానికి ఐశ్వర్య దేవత మరియు స్త్రీల మధ్య తేడా లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి