మహాభారతంలో కర్ణుని కున్న శాపాలు మనందరికీ తెలుసు కానీ రావణుడు ఎంతో శివభక్తి శక్తి యుక్తి ఉన్న వాడైనా అహంకారం స్త్రీ వ్యామోహం తో శాపాలతో పాపాలు చేసి రాముని చేతిలో హతమైనాడు.ఇక్ష్వాకు వంశానికి చెందిన అనరణ్యుడి తలను ఖండించి వికటాట్టహాసం తో పరిహాసం చేశాడు రావణుడు." మా వంశం వాడి చేతిలో నీకు చావు తప్పదు" అని శపించాడు అనరణ్యుడు.కుశధ్వజుని కుమార్తె వేదవతి తల్లి తండ్రులను కోల్పోయిన తర్వాత తపస్సు చేసుకుంటున్న సమయంలో రావణుడు ఆమెను బలాత్కారం చేయబోయాడు.ఆమె కుపితురాలై" నేను అయోనిజగా పుట్టి శ్రీమహావిష్ణువుని ఇల్లాలినై నిన్ను సర్వనాశనం చేస్తా" అని శపించింది.ఆమెయే సీతామాత.అహంకారి మదోన్మాదంతో కైలాస పర్వతం ని చలింపజేయటంతో పార్వతీ దేవి శపించింది " దుర్మార్గుడా! ఒక తరుణి ని భయపడేలా చేశావు.ఓవనిత కారణం గా నీకు చావు మూడు తుంది." కైలాసంలో కాపలాగా ఉన్న నందీశ్వరుడిని రావణుడు"కోతి మొహం వాడా!" అని గేలి చేస్తాడు."వానరుల మూలంగానే నీవు చస్తావు"అని నంది శపించాడు.అప్సరస రంభ ను బంధించబోతే ఆమె పై అఘాయిత్యం చేయబోతే నలకూబరుడు" నా ప్రియురాలిని కామించిన నీవు పరస్త్రీ వ్యామోహం తో చెరబట్టి ఆమె కారణం గా చస్తావు" అని శాపమిచ్చాడు. బ్రహ్మదర్శనం కోసం బైలుదేరిన పుంజికస్థల అనే అప్సరస రావణుని కంట బడుతుంది.ఆమె మబ్బుల మాటున నక్కినా అఘాయిత్యం చేయబోతే బ్రహ్మ దేవుడు శపిస్తాడు " నీవు ఏమగువనైనా బలవంతంగా బలాత్కారం చేస్తే నీ తల ముక్కలు చెక్కలు అవుతుంది." అందుకే సీతమ్మ ను అశోకవనంలో ఉంచాడు కానీ శాపం కారణంగా బలాత్కారం చేయలేదు.మరిప్పుడు ఇన్ని ఘోరాలు నేరాలు మన భారత్ లో జరుగుతున్నాయి.అవన్నీ మహర్షులు దివ్యదృష్టితో చూశారు.దీనికికారణం నేటి పెద్దలు! టి.వి.లో రామాయణం మహాభారతం సీరియల్స్ చూస్తున్నారు అంతా.కానీ అమ్మ నాన్నలు ఆకథ గురించి పాత్రల మంచి చెడుల గురించి చెప్పరు.బడిలో పుస్తకం లో చదివినా ప్రశ్న కి జవాబు రాయటంతోనే పని ముగించే రోజులు.గుడికి వెళ్లినా అక్కడి దైవం పేర్లు చెప్పాల్సిన బాధ్యత పెద్దలకు లేదా? 🌸
రావణునికి ఎన్నో శాపాలు! . సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి