అరక్షిత లైంగిక సంపర్కం వలన ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కనుక నిశ్శబ్దాన్ని ఛేదించి, తగు జాగ్రత్తలు పాటించాలని గెస్ట్ టి.ఐ.సంస్థ ఒక.ఆర్.డబ్ల్యు భూపతి లక్ష్మి అన్నారు. కడుము గ్రామంలో జీడిపరిశ్రమ కార్మికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకు తెలుసా కార్యక్రమంలో హెచ్.ఐ.వి. సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలంటూ అవగాహన కల్గించారు. లైంగిక సంపర్కంలో సురక్షిత కండోమ్ వాడకం తప్పనిసరి అని, కొత్త సూది, సిరంజి ఉపయోగించాలని, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకకుండా జాగ్రత్త వహించాలని, కొత్త రక్తం సీసాలనూ మాత్రమే ఉపయోగించుకోవాలని ఆమె అన్నారు. యువత హెచ్.ఐ.వి. పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధికి మందులేదని ముందు జాగ్రత్త వహించుట మాత్రమే సమాజానికి రక్షణయనీ లక్ష్మి వివరించారు.
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం- ఎయిడ్స్ వ్యాధి నిర్మూలిద్దాం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి