న్యాయాలు -615
బహు సపత్నీక న్యాయము
******
బహు అనగా అధికము సమృద్ధము అనేకము తఱచు పెద్ద అధికముగా పెద్దగా.సపత్నీక అనగా సవతి అని అర్థము.
ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి పరిస్థితి వలె.
అనగా ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్థితి.
పూర్వము కొందరిలో బహు భార్య పద్ధతి ఉండేది. మరి ఆ విషయాలు విశేషాలూ తెలుసుకుందామా...
పైన చెప్పిన విధంగా రామాయణంలో ధశరథ మహారాజు,భారతంలో పాండురాజు, దృతరాష్ట్రుడు, అర్జునుడు,భాగవతంలో శ్రీకృష్ణుడు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మనకు గుర్తుకు వస్తుంటాయి.
మరి ఈ సపత్నీక విధానం కేవలం పురాణాలు ఇతిహాసాలే కాదు.చరిత్ర చదివితే కొందరు రాజులు కూడా ఎక్కువ మందిని వివాహమాడే వారని తెలుస్తుంది.
భారత దేశాన్ని 16 వి శతాబ్దంలో పరిపాలించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు 300 మంది భార్యలు ఉన్నారని, హైదరాబాద్ నిజాం నవాబుకు 600 మంది భార్యలు ఉండేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయిఒకప్పుడు ప్రపంచంలో ఆ విధంగా ఎంతోమంది రాజులు తాము యుద్ధం చేసి గెలిచిన రాజు యొక్క కుమార్తెలను వివాహం చేసుకునే వారు.
ఆ తర్వాత తర్వాత సమాజంలో చాలా చాలా మార్పులు వచ్చాయి.తదనుగుణంగా ఏక పత్ని వ్యవస్థ అనగా ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే భార్యగా ఉండాలనే చట్ట అమలులోకి వచ్చింది.
అయితే ఈ న్యాయానికి సంబంధించి కవి శ్రీనాధుడి రాసిన చాటు పద్యాన్ని ఒకసారి చూద్దాం.
సిరి గల వానికి జెల్లును/తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్ /తిరిపెమున కిద్దరాండ్రా/ పరమేశా గంగ విడుము పార్వతి చాలున్/
ఆ కాలంలో వర్షాలు పడక ప్రజలు చాలా బాధలు పడుతున్నారట. ధనవంతుడైన శ్రీ కృష్ణుడికి చెల్లుతుంది పదహారు వేల స్త్రీలను వివాహం ఆడటం.అలాగే భిక్షాటన చేసే నీ కెందుకు స్వామి ఇద్దరు భార్యలు. నీకు పార్వతి చాలు కానీ గంగను మాకు వదిలిపెట్టు.వర్షాలు కురిపించు అంటాడు.
అయితే ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే..దేహంలోని ఇంథ్రయాలే సపత్నుల్లా భేదిస్తుంటాయి. బాధిస్తుంటాయి. ఏ ఒక్క ఇంద్రియాన్ని సంతృప్తి పరచడం కష్టం.కేవలం యోగా విధానం ద్వారా వాటిని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అంటారు.
ఏది ఏమైనా "ఈ బహు సపత్నికా న్యాయము" ద్వారా సవతులుగ ఉన్న వారి మధ్య తప్పకుండా భేదాభిప్రాయాలు, ఏదో ఒక దాని మీద వస్తూ ఉంటాయి.కాబట్టి మన భగవంతుడిని ధ్యానిస్తూ,యోగా చేస్తూ వుంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చు అంటారు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సిది ఏమిటంటే సపత్నుల వ్యవహారం జోలికి మాత్రం మన పోకుండా ఉందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి