🪷శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు

శ్లో: భక్తో భక్తి  గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రి పల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలమ్
సత్వం మంత్ర ముదీరయన్. నిజశరీరాగార  శుధ్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి  రుచిరం కల్యాణమాపాదయన్ !!

భావం: ఓ సాంబశివా !  భక్తుడైన వాడు తన శరీరము అనే
గృహమును శుద్ధి చేసుకుని భక్తి
అనెడి దారముతో  చుట్టి సంతోషము అనే నీటితో నింపి
 హృదయమనెడి కలశములో నీ పాదము లనెడి చిగుళ్ళను, జ్ఞానము అనడి టెంకాయను 
నిలిపి శివమంత్రమును
ఉచ్చరించుచూ పుణ్యాహ వచనము గావించుచున్నాడు. 
                     *****

కామెంట్‌లు