ఫోటోలనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పాత పాత ఫోటోల విషయమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాటిని కొన్నేళ్ళ తర్వాత చూస్తే వచ్చే జ్ఞాపకాలు అన్నీ ఇన్నీ కావు. రెండు రోజుల క్రితం ఒకతను తన తాతయ్య, బామ్మలకు ఫోటో తీసి మురిసిపోయాడు. ఈ తాతయ్య బామ్మలకు పెళ్ళయి అరవై ఏళ్ళయ్యింది. కానీ ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో వీరెన్నడూ కలిసి ఫోటోషూట్ లో పాల్గొనలేదు. అయితే ఆ లోటు తీర్చడం కోసం మనవడు 2 రోజుల క్రితం ఫోటో షూట్ ఏర్పాటు చేసి తనకు కావలసిన విధంగా ఫోటోలు తీసి ఆనందించాడు. వాటిలో ఒకటే ఇక్కడి ఫోటో. ఈ నెలలోనే తాతయ్య ఎనభయ్యో పుట్టింరోజు చేసుకుపోతున్నారు. ఆరోజున తన ఫోటోలతో ఓ మంచి ఆల్బమ్ డిజైన్ చేసి తాతయ్య - బామ్మలకు కానుకగా ఇస్తానన్నాడు వారి ముద్దుల మనవడు. నా జీవితంలో ఈ ఫోటో షూట్ చిరస్మరణీయమని, ఇంతకన్నా గొప్ప తరుణం ఇంకేముంటుందని అన్నాడు. ఇది తనకో గౌరవమని చెప్పాడు. అతని అందమైన అమ్మమ్మ మాక్యులార్ డీజెనరేషన్‌తో బాధపడుతోంది పాపం.
తాతయ్య, అమ్మమ్మల ఫోటో షూట్;- - యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి