శ్లో:
నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః
పూజ వా స్మరణం కథా శ్రవణ మప్యాలోకనం మాదృశామ్
స్వామిన్నస్థిర దేవతానుసరణా యాసేన కిం లభ్యతే
కావా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్దనీయం తదా !
భావం: దేవా! శివా! నిను ఒక్కసారి సేవించినా,నమస్కరించినా, స్మరించినా, పూజించినా, దర్శించినా, నీ కథను విన్నా చాలును. దీనికంటే ముక్తి మరొకటి లేదు కదా! మా వంటి వారికి ఈ పైన చెప్పిన వాటి వల్ల, ముక్తి కలుగుతూ ఉండగా, అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించడం వలన ఏమి లభించును.
*****
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి