కిరణాలతో దోబూచులు
తరగలపై సయ్యాటలు
నురగలపై నీటి రాతలు
వెలుగులతో ఆటపాటలు..
పైకి సరదాల అల్లరి
లోన అగాధాల అలజడి
కెరటాల హోరున్నా
మౌనమే తన ఒరవడి..
తప్పు ఒప్పుల తరాజులు
మంచి చెడుల చర్చలు
పిరికితనానికి పాఠాలు
ఆత్రానికి ఆంక్షలూ.....
సహనానికి సరిహద్దులు
సహకారపు సలహాలు
సంవేదనల ఓదార్పులూ
సంరక్షణకు రాజీలు ....
మనసు మనతో చెప్పేవి
మనము మనసుకు నచ్చ చెప్పేవీ
మనుగడ సుగమం చేసే
మంచిమాటల మూటలు.
మదిలోని సొదలు వినే
సమయమివ్వక
మనకు నచ్చినదే మంచిదంటూ
వాదించే తెలివితేటలు
మనలోకి తొంగి చూసుకునే
తీరిక చేసుకుంటే...
మనమేమిటో మనకి తెలిసి
మార్పు అవసరం తెలుస్తుంది
మనసు స్థిరంగా చేసుకుని
చేతిలోని క్షణాలను
మధురంగా మార్చుకోమని
మాయతెరలు తొలగించే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి