మొదట
మనం ఉన్నది మనకు నచ్చదు.
అది పల్లె అయినా పట్టణమైన
ఏ భూభాగమైన
తర్వాత తర్వాత
అలవాటు పడతాం ఇష్టపడతాం!!
వాటితో కలిసి జీవిస్తాం!!
కొంతకాలం తర్వాత
మనం
వాటికి జ్ఞాపకాలం
మనకు అవి జ్ఞాపకాలు మాత్రమే!!!
మొదట
మన పుట్టుక మనకు నచ్చదు
ఆ తర్వాత
కష్టపడతాం ఇష్టపడతాం!!
ఆ తర్వాత
పుట్టుకకు మనం జ్ఞాపకాలం
మనకు పుట్టుక ఒక జ్ఞాపకం!!!!?
మొదట
మన చుట్టూ ఉన్న
మనుషులను మనం ఇష్టపడం
కానీ కష్టంలో ఇష్టం లో
కలిసి జీవించి ప్రేమిస్తాం ఇష్టపడతాం!!
కొంతకాలం తర్వాత
వాళ్లకు మనం జ్ఞాపకాలు
వాళ్లు మనకు జ్ఞాపకాలు!!!?
ఏదీ శాశ్వతం కాదు!!.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి