పంజాపూర్ గ్రామంలో చలమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అందరికంటే తానే చక్కగా ఉండాలని శుభ్రమైన బట్టలు కట్టుకొని, ఆకర్షణీయంగా కనిపించేవాడు. అలాగే తన ఇంటి చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుతూ, పచ్చని చెట్లను పెంచుతూ ఆనందించేవాడు. కానీ చలమయ్య ఇతరులను అసలు పట్టించుకునే వాడు కాదు. తాను మాత్రమే ఆకర్షణీయంగా ఉండాలనే మనస్తత్వం కలవాడు. గ్రామస్తులు చలమయ్యను చూసినా, చలమయ్య ఇంటిని చూసినా సంబరపడేవారు. కానీ చలమయ్యకు తాతలు సంపాదించిన ఆస్తి ఉంది. తాను ఎంత శుభ్రంగానైనా ఉండవచ్చు. తాము ఉండలేముగా రెక్కాడితే గాని డొక్కాడదు అనుకుని వారి వారి పనులు చేసుకుంటూ జీవించేవారు.
ఒకరోజు అనుకోకుండా చలమయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. పట్నంలో ఆసుపత్రిలో చేర్పించారు. పక్షం రోజుల తర్వాత చలమయ్యకు ఆరోగ్యం కుదుటపడింది. తన అనారోగ్యానికి కారణం చలమయ్య డాక్టర్లను అడగగా దోమ కుట్టడంతో అలా అయిందని తెలిపారు. తమ ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని చలమయ్య డాక్టర్లకు సమాధానం ఇచ్చారు. మీ ఇల్లు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటేనే సరిపోదు. ఇరుగుపొరుగు ఇండ్లు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇరుగుపొరుగు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అక్కడి దోమలు వచ్చి కుడుతాయి కదా అని డాక్టర్లు బదులిచ్చారు. చలమయ్య తన అవివేకానికి మదనపడ్డాడు. తిరిగి ఊరెళ్ళాక తన ఇంటితో పాటుగా ఇరుగుపొరుగు ప్రాంతం కూడా పరిశుభ్రంలా ఉండేలా కృషి చేశాడు. చలమయ్య చేసే మంచి పని నచ్చి గ్రామస్తులంతా తమ తమ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోసాగారు. అప్పటినుంచి చలమయ్య తాను చక్కని దుస్తులు ధరిస్తే సరిపోదు. తోటి వారందరూ ధరిస్తేనే సంతోషం ఉంటుందని గ్రహించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి