న్యాయాలు-634
భస్మన్యాజ్యాహుతి న్యాయము
******
భస్మన్ అనగా తెల్లగా కాలిన పొడి, బండి,పలుకుట, బూడిద. ఆజ్య అనగా నేయి, నేయి పాత్ర,నేతి గిన్నె.ఆహుతి అనగా ఏదేని ఒక దేవతకు చెందడానికి అగ్ని ద్వారా ఇచ్చునది,హనన సామగ్రి ( నేయి మొదలైనవి).
బూడిదలో నేయి హోమము చేసినట్లు. అనగా అకార్య కరణమునకు అనగా చెడు పనులు చేయబోయే, చేసే మూర్ఖుడికి బోధించుట నిష్ప్రయోజనమని అర్థము. దీనినే తెలుగులో "బూడిదలో పోసిన పన్నీరు" అంటారు.
బూడిద అంటేనే కాలిన తరువాత మిగిలిన అవశేషము.అలాంటి బూడిదలో నేయి వేస్తే మండుతుందా ?మండదు కదా! నేయి హనన స్వభావం కలిగి ఉన్నప్పటికీ దానికి కావలసిన మంట లేకపోతే మండదు.కాబట్టి బూడిదలో పోసిన నెయ్యికి ప్రయోజనం లేదు .
నెయ్యిని మనలో ఎంతోమంది ఇష్టంగా తింటారు.నెయ్యిని వంటల్లో వాడినప్పుడు రుచితో పాటు అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇక ఆయుర్వేదంలో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నెయ్యిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది.మన పెద్దవాళ్ళు అలాంటి నెయ్యిని నిత్యం వాడటం వల్ల మేథో శక్తి పెరుగుతుందని అంటారు.
మేథో శక్తి రూపమైన నెయ్యతో మూర్ఖమైన బూడిదను మార్చాలని చూస్తే నెయ్యి ఎందుకు పనికిరాకుండా పోతుంది.
దీనినే మన పెద్దలు మనిషి మనస్తత్వంతో పోల్చి చెప్పారు.
చెడు ఆలోచనలతో నిండిపోయిన మానవ స్వభావాన్ని మార్చడం చాలా కష్టం.వాళ్ళకు ఎన్ని మంచిమాటలు చెప్పినా చెవికి ఎక్కవు.ఒక విధంగా పనికిరాని బూడిద లాంటి వాళ్ళు.వాళ్ళను కదిలిస్తే రాలేది బూడిదే.వాళ్ళతో చేరితే మన అస్తిత్వం ,మన వ్యక్తిత్వం మరుగున పడి పోతాయి.
పన్నీరు లాంటి వాళ్ళు బూడిద లాంటి మూర్ఖులను మార్చాలని ప్రయత్నిస్తే పన్నీరులోని సువాసన సుగుణాలు పనికి రాకుండా పోతాయి.
అందుకే మూర్ఖులను మార్చడం కష్టమని ఓ పద్యంలో ఇలా చెబుతాడు.
"తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు/ తవిలి మృగ తృష్ణలో నీరు ద్రావవచ్చు/తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు!/
అనగా ప్రయత్నం మీద ఇసుక నుంచి నూనెను తీయవచ్చు.ఎండమావి యందు నుంచి నీరు తీసుకుని తాగవచ్చు.తిరిగి తిరిగి కుందేటి కొమ్మును ఎలాగైనా సాధించవచ్చు.కానీ మూర్ఖుల మనసును మాత్రం సరిచేయడం,సమాధాన పెట్టడం సాధ్యం కాదని అర్థము.
కాబట్టి అలాంటి వారి కోసం మన సమయాన్ని వృధా చేయకుండా ఉండటమే మంచిది. పరమ మూర్ఖులు, దుష్ట స్వభావం కలిగిన వారిని మార్చాలని చూడటం వృధా ప్రయాస. అందుకే మనం బూడిదలో పోసిన నెయ్యి లానో, పన్నీరు లాగానో మారకుండా అలాంటి వారిని దూరంగా ఉంచుదాం లేదా దూరం పెడదాం. ఈ భస్మాన్యాజ్యాహుతి న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఇదే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి