-తాతయ్య బాగున్నారా. రాంచరణ్ పదవతరగతి -ZPHS Narmetta
 . ప్రియమైన తాతయ్య బాగున్నారా. నేను కూడా బాగున్నాను. మీరు సమయానికి మందులు వేసుకుంటున్నారా. మీ మోకాలు నొప్పి తగ్గిందా తాతయ్య. నువ్వు నాయినమ్మ బాగున్నారా. మీరు నన్ను చిన్నప్పుడు ఏంతో బాగా చూసుకున్నారు. మీరు నన్ను చిన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నారు. మీరంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. మీరు నన్ను   ఏ డ్వావాద్దని  మీ కష్టం దాచి నన్ను చూసుకున్నావు. తాతయ్య మీరు నన్ను మీ భుజాలమీద ఎత్తుకుని ఊరంతా తిప్పావు. నువ్వు పనికి వెళ్లి ఆ డబ్బులతో నాకు బట్టలు మరియు తినటానికి పండ్లు తెచ్చేవాడివి. తాతయ్య జాతరకు వెళ్ళినప్పుడు, నేను రోడ్డు మీద ఉన్నానని చూసి నన్ను బండి గుద్దకుండా నా ప్రాణాలు కాపాడావు. నీకు ప్రమాదం అని తెలిసిన కూడా నన్ను కాపాడావు. తాతయ్య నువ్వు నన్ను నీతో ఊరులకు తీసుకోనిపోయవాడివి. నాకు ఎన్నో ఆటలు ఆడిపించేవాడివి తాతయ్య. నన్ను నువ్వు రోజు బడికి తీసుకెళ్ళేవాడివి. తాతయ్య మీరు నన్ను కొట్టిన తిట్టిన నా మంచి కోరేవాడివి తాతయ్య. తాతయ్య మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన పండ్లు, లడ్డులు తెచ్చేవాడివి. తాతయ్య నువ్వు నాకు, అన్నం తినకపోతే నువ్వు నాకు తినిపించేవాడివి. తాతయ్య మీరు నాకోసం ఎన్నో పనులు చేసావు. నేను కూడా మంచిగా చదువుకొని నీ యొక్క కష్టాలు తీరుస్తా తాతయ్య. మీ యొక్క శుభాషిషులు తాతయ్య.ఇట్లు, మీ ప్రియమైన మనవడు రాంచరణ్, 10వ తరగతి, క్రమాసంఖ్య (14),జిల్లా పరిషత్ హై స్కూల్ నార్మెట్ట.                      చిరునామా :-పేరు :-రాములు ఊరు పేరు :-నార్మెట్ట కాలనీ, ఎల్లమ్మ బజార్.

కామెంట్‌లు