సోషల్ మీడియా (సామాజిక మాధ్యమం);- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
ఇక్కడ ఎవడి సెల్ఫ్ డబ్బా వాడే కొట్టుకోవచ్చు
నువ్వు వినకపో
వినేవాడికి హింసైనా 
నీ సెల్ఫ్ డబ్బా నువ్వు ఎంతైనా కొట్టుకోవచ్చు

స్మార్ట్ ఫోన్  అరచేతిలో ఒదిగిపోయాకా?!
ప్రతీ ఒక్కడూ ఒక వక్తే?!
సోషల్ మీడియాలో అతడొక ఆచార్యుడే!?

ఇక్కడ ఆచరణ సాధ్యం కానివి
అవతలివాళ్లకు చెప్పేసి
తలాతోకాలేని సవాళ్లను రచ్చకీడ్చీ
రాక్షసానందం పొందే
 సోషల్ మీడియా సోకాల్డ్ మేధావులు

ఇంట్లో పావలాకు గొరగానోడు
ఫేస్ బుక్ ,ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో
పదిమందితో జతకడతాడు
ఆన్లైన్లో బహిరంగ సభపెడతాడు

ఇక్కడ తిరస్కారమున్నట్లే
సత్కారమున్నది
పరస్పర భావప్రసారవినిమయంతో
ప్రాంతం దేశం రాష్ట్రం
 ప్రపంచపు ఎల్లలు చెరిపి ఖండాంతరల్లో ఖ్యాతిని సంపాదించొచ్చు

నీ (మీ)ప్రతిభను ప్రదర్శించుకోవడానికి
అత్యుత్తమ ప్లాట్ ఫామ్
ఉపయుక్తమైన సమాచారంతో
ఉత్తమోత్తమమైన స్థాయిని పొందే
అతిపెద్ద రంగస్థలం
దీన్ని చేయోద్దు రణస్థలం

ఆన్లైన్లో (వాట్సాప్ ఫ్రెండ్  ఫేస్ బుక్ ఫ్రెండ్ అని )ముక్కు మొహం తెలియని వాడితో చేయకు వ్యాపారం
 మాయామంత్రదండమే
 వాడి బలం
తెలియకపెట్టుబడిపెడితే దివాళా తీయడం ఖాయం

ఇక్కడ మంచి మనుషులు ఉన్నట్లే
ముసుగు మనుషులు (హాకర్స్)ఉంటారు
ఇక్కడ మరాళంనువ్వైతే
పాలను నీళ్ళను వేరు చేయగలవు

ఇక్కడ హృదయపూర్వకంగా
ఉండేదెందరని?!
మన ఆలోచనలతో ఏకీభవించే, సంఘర్షించే వారెందరని?!
అంతా మన ప్రారబ్ధం
అంతా శుభసూచకం అనుకోవడం తప్పా!?

కామెంట్‌లు