వీధి బడి-విపణి బడి!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
 1.
వాడు వీధి బడిలో చదివాడు! 
మనుషుల మధ్య పెరిగాడు! 
సగటు మనిషి గానే ఉన్నాడు!
వెగటు పనులేవి చేయలేడు!
అందరివాడుగా బతుకుతాడు!
2.
వాడు చదువుకి రేటు కట్టాడు! 
ఆకాశమంత ఎత్తు ఎదిగాడు! 
భూమి మరిచి జీవిస్తున్నాడు! 
తనకి తానే బతుకుతుంటాడు!
మరి కొందరికే కావల్సినవాడు!
మనిషి   కానినాడు,
        వాడు ఏమైతేనేం?
________


కామెంట్‌లు