బాలలుండే చోటు బడి!:- -గద్వాల సోమన్న,-9966414580
బాలలుండే చోటు
భువిని పాఠశాలలు
వారి భవితకు లోటు
ఉంటేనే ఇడుములు

బడిలోనే బాల్యము
అగునోయ్! బంగారము
ఉన్నత వ్యక్తిత్వము
దిద్దుకొనును రూపము

పవిత్రమైన మందిరము
బడి ఎంతో సుందరము
అనుదినము పిల్లలను
పంపాలి అందరము

నిర్లక్ష్యం చేస్తే
బడిని మానివేస్తే
ఎదుగుదలకు గండి
నిజాలు తెలుసుకోండి

బడిలేని బాల్యమే!
పరికింప నరకమే!
బడి ఈడు పిల్లలను
చదివింప ధర్మమే!

బాలలను చదివించుట
మన కనీస బాధ్యత
ఈ సత్యము ఎరుగుట
జీవితాన ధన్యత


కామెంట్‌లు