గుండెగుండెలో ఊగే మట్టి సొదల
బతికిన ఉనికి
చెట్టుపుట్టల కలిమిడి సీమ ఊరు
నలుగురు కలిస్తే
పలకరించే సోపతి కనుల
చేతులు కలిపే మాటలు తీపి ఊటలు
చల్లగాలుల చెరువు గట్టు
చెరువు పారి నర్తించు వరి పొలం
బాయి చెలకలు జొన్న కంకి
గుండెల నిండుగా జనం బతికిన కాలం
కథా కథనం పూసే ప్రేమాకాశం అది
కథలో గుండె చెలిమె పొంగే ఆట
కవితల పల్లీయం పాటల కిన్నెర
చెదిరిన ముఖంలో చిరునవ్వు నల్లమబ్బు
ఎండిన బాయిల ఇంకిన నీళ్ళు
తడారని కళ్ళలో ఎడారి కన్నీళ్లు
పుస్తకం తెరుచుకోని మనసు
ఎగిరిపడే ముఖపుస్తకంలో వెదికే
సెల్లు ప్రపంచం సిస్టంపై ఆడించే నీడలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి