బంధుత్వం:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మా పెరటిలో
చెట్టుకింద ఉన్న
బావి గట్టున
కూర్చున్న నన్ను
తమాషా రంగుల పిట్టలు 
ఆకుల గుహల్లో నుండి
తొంగి చూస్తున్నాయి
ఆ పిట్టల రెక్కల్లో నుండి
చిన్నచిన్న ఈకలు కొన్ని
గాలిలో తేలుతూ
వచ్చి నాపై వాలాయి
ఆ చిన్ని పిట్టలు
నా చుట్టూరా
గెంతుతూ, ఎగురుతూ,
తిరుగుతూ పలకరిస్తున్నాయి
వాటి పాట 
ఎప్పుడో విన్నట్టు నాకుగుర్తే
నాకూ వాటికీ
ఏదో బంధుత్వం
ఉన్నట్టుంది కదూ?!
**************************************


కామెంట్‌లు