ఊరుగాలి ఈల:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
గాలికి ఎగురని విస్తరి బువ్వ
ఎవరూ దోయనీ దోసిలి నీరు
నిరంతరం పారే సెలయేరు ఊరు

తల్లి వేరు ఎద ఉమ్మడి కుటుంబం
ఎగిరే పక్షి రెక్కలే బంధుగణం
తల్లిదండ్రుల కష్టం నిట్టాడు నిచ్చెన 

జోలపాడిన జన్మ నేత్రం 
చంకెత్తుకున్న ఆత్మీయ నేస్తం అమ్మ
బాధ బాధ్యత ఎదకెత్తుకున్న సమస్తం

ఆకలి రాసిన ఆటవెలది పొదుగు
చీకటి మాపిన తేటగీతి నుడుగు
ఆట పాటల గొంతుగానం ప్రకృతి కృతి

అమ్మ మమతల పొదరిల్లు 
పిల్లల భవిత రెక్కల చెమటల ఇల్లు 
అందాల గంధాల విరిసే సుమ సుందరం

అవని సుస్థిర చిరునామా వెలుగు
అడుగడుగున కళ చీమలబారు 
మాట కలిసి కదిలే చేతన ఊరు

ననుగన్న తల్లి తల నా ఊరు
తల నిమిరి రాసింది ఇలను నా పేరు 
గుండెగుండెల నిలిచే ఆకుపచ్చ చెట్టు

**********************************************

(ఊరు కొనసాగు ఇంకా)

కామెంట్‌లు