తనను తాను పాతిపెట్టుకుంటున్నాడు.
తనకేదీ కనబడకూడదనుకుంటున్నాడు.
అన్నిటినీ మరిచిపోవాలనుకుంటున్నాడు.
తనకెలాంటి బాధ్యతలుండకూడదనుకుంటున్నాడు.
తానెవరి మీదా ఆధారపడకూడదనుకుంటున్నాడు.
ఎవరికీ భారం కాకూడదనీ,
జవాబుదారీ కాననీ,
కర్తవ్యం అక్కరలేదనీ,
సంపాదన ఎందుకనీ,
సంతోషాలేవీ వద్దనీ,
సుఖాలన్నీ మూటగట్టి పారేసీ,
నవ్వులను మరిచిపోయీ,
నమ్మకాన్ని వదిలిపెట్టీ,
కలి ఆకలికి బలికాబోతున్నాడు.
కలల కాగడాలను ఆర్పేసీ,
వలల వ్యామోహాలను విసిరేసీ,
కథలను వినీ,వినీ విసుగుచెందీ,
కాలానికి సవాలు విసురుతూ,
కష్టాలను కంచికి తోసేసీ,
గుర్తులన్నీ శాశ్వతంగా చెరిపేసీ,
జ్ఞాపకం కూడా నిలబడకూడదనీ,
ఫేసుబుక్కు కూడా చూపించకూడదనీ,
వాట్సాపు వల్లె వేయకూడదనీ,
ఇన్స్టాగ్రాములో ఇతిహాసం కాకూడదనీ,
చిత్రమయ్యో,పాటయ్యో,
కైతయ్యో ఉండకూడదనీ,
ఉద్ధరించేవారు రాకూడదనీ,
చిత్తాన్ని స్తంభింపజేసీ,
చలనాన్ని నిరోధించీ,
శ్వాసను శాసించీ,
గుండెచప్పుడుని నిశ్శబ్దం గావించీ,
మరణించీ,బతుకుతున్నాడు.
తనకేదీ కనబడకూడదనుకుంటున్నాడు.
అన్నిటినీ మరిచిపోవాలనుకుంటున్నాడు.
తనకెలాంటి బాధ్యతలుండకూడదనుకుంటున్నాడు.
తానెవరి మీదా ఆధారపడకూడదనుకుంటున్నాడు.
ఎవరికీ భారం కాకూడదనీ,
జవాబుదారీ కాననీ,
కర్తవ్యం అక్కరలేదనీ,
సంపాదన ఎందుకనీ,
సంతోషాలేవీ వద్దనీ,
సుఖాలన్నీ మూటగట్టి పారేసీ,
నవ్వులను మరిచిపోయీ,
నమ్మకాన్ని వదిలిపెట్టీ,
కలి ఆకలికి బలికాబోతున్నాడు.
కలల కాగడాలను ఆర్పేసీ,
వలల వ్యామోహాలను విసిరేసీ,
కథలను వినీ,వినీ విసుగుచెందీ,
కాలానికి సవాలు విసురుతూ,
కష్టాలను కంచికి తోసేసీ,
గుర్తులన్నీ శాశ్వతంగా చెరిపేసీ,
జ్ఞాపకం కూడా నిలబడకూడదనీ,
ఫేసుబుక్కు కూడా చూపించకూడదనీ,
వాట్సాపు వల్లె వేయకూడదనీ,
ఇన్స్టాగ్రాములో ఇతిహాసం కాకూడదనీ,
చిత్రమయ్యో,పాటయ్యో,
కైతయ్యో ఉండకూడదనీ,
ఉద్ధరించేవారు రాకూడదనీ,
చిత్తాన్ని స్తంభింపజేసీ,
చలనాన్ని నిరోధించీ,
శ్వాసను శాసించీ,
గుండెచప్పుడుని నిశ్శబ్దం గావించీ,
మరణించీ,బతుకుతున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి