నా అంతరంగం;- గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ భాగ్యనగరం
ఆకాశపు  అంచులను
చేరాలని  నాకున్నది 

అవనినిండా ఆక్షరాలను
చల్లాలని నాకున్నది 

గాలిలోన శబ్ధాలను
వదలాలని నాకున్నది

కిరణాలలో  పదాలను
కలపాలని నాకున్నది

అమోఘమైన ఆలోచనలను
ఆవిష్కరించాలని నాకున్నది

ఆకట్టుకునే శైలిని
వాడాలని నాకున్నది 

తేనెలొలుకు పలుకులను
చిందాలని నాకున్నది

పాఠకుల అంతరంగాలను 
దోచాలని నాకున్నది

అబ్బురపరచే విషయాలను
వెల్లడించాలని నాకున్నది

అద్భుతమైన కవితలను
ఆవిష్కరించాలని నాకున్నది 


కామెంట్‌లు