ఒక అడవిలో కుందేలు పొదలో, దాని పక్కనే ఎలుక కన్న౦లో నివసిస్తు౦డేవి. కుందేలు ఎలుక తో సఖ్యత తో ఉండేది కాదు. పైగా ఎలుకను అసహ్యించు కునేది.నువ్వు నల్లగా ఉ౦టావని , నిన్ను అందరు అసహ్యించుకు౦టారని, మనుష్యులు ఇంట్లోకి రానివ్వరని, నేను తెల్లగా అ౦ద౦గా ఉంటానని, మనుష్యులు కొ౦దరు నన్ను పె౦చుకు౦టారని, నేను చెవులు రిక్కి౦చి పరుగెత్తుతు౦టె ముద్దు చేస్తారని ఎలుక తో గొప్పలు చెప్పేది. ఎలుక ఎదురైనా కనీసం మాట్లాడేది కాదు.
ఇలా ఉండగా ఒకనాడు కుందేలు నివసించే పొద సమీపమున ఒక వేటగాడు వల పన్నాడు. అది తెలియని కుందేలు ఆ వలలో చిక్కుకుంది.
వేటగాడు పరుగు పరుగున వచ్చి కుందేలును వల నుండి తీసి దాని కాళ్లను తాళ్లతో బంధించి భుజముమీద మోసుకు౦టూ స౦తోష౦గా వెళుతున్నాడు. ఇది గమనించిన ఎలుక కుందేలును కాపాడాలనే ఉద్దేశంతో పరుగున వేటగాడికిఎదురెళ్ళి,కొద్ది దూరంలో నీవు పన్నిన మరో వలలో ఒక పెద్ద జింక చిక్కుకుంది. అని తెలపగా వేటగాడు ఆశతో తన భుజంపై ఉన్న కుందేలును కింద కు ది౦చగా ఎలుక వేగంగా కుందేలు దగ్గరకు వెళ్లి తన కాళ్లకు ఉన్న తాళ్లను తన వాడియైన పళ్ల తో కొరికి కుందేలును కాపాడింది.
ఇన్ని రోజులు తాను చీదరి౦చుకొన్న ఎలుక తన ప్రాణాలు కాపాడిన౦దుకు కుందేలు సిగ్గు తో తల దించుకొని ఎలుక ను క్షమాపణలు అడిగింది.
అప్పుడు ఎలుక మిత్రమా!నేను వేటగాళ్ల బారినుండి,
వారి వలలో చిక్కిన ఎన్నో ప్రాణులను కాపాడాను.
నిన్ను అ౦దరూ ముద్దు చేస్తారని, కొందరు యజమానులు ఇళ్లల్లో పె౦చుకు౦టారని నాతో గొప్ప లు చెప్పావు. బాగా నే ఉంది.
మరి నేను కూడ గణేష్ నవరాత్రులలో వినాయకుడి
తో పాటు భక్తుల౦దరి పూజలు అ౦దుకు౦టాను.
ఆ విషయాన్ని నేను నీతో గర్వంగా చెప్పలేదే!.
అయినా సృష్టి లో ఏ ప్రాణి గొప్ప దన౦ దానికు౦టు౦ది. అ౦త మాత్రమున మిగతా ప్రాణులను మన౦ చులకనగా చూడకూడదని ఎలుక కుందేలు కు హితబోధ చేసింది. ఆ రోజు నుంచి కుందేలు ఎలుక ప్రాణ స్నహితులు
గా మెలగసాగాయ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి