చిత్ర స్పందన : -. కోరాడ నరసింహా రావు !

 అతివలకు అలంకరనే ప్రీతి
 తనివి తీర తాన మాడి
    చక్కగ చీరనే కట్టి
     కురులను సవరించి దువ్వి
       చక్క గాను జడను అల్లి
     మురిపెముగా మల్లెల దండను గుచ్చి 
     కళ్లకు తీరుగ కాటుక దిద్ది
   నుదుటన చక్కగ బొట్టుపెట్టి
  నట్టింట  నడయాడే మహిళ
     సాక్షాత్ శ్రీ మహా లక్ష్మి యే
  ఆ ఇంట సిరి, సంపదలే...! 
         ******

కామెంట్‌లు