అందమైన వెలుగు బంతి
ఆకసాన విసిరినదెవరో?
ఆడుకునే ఆటగాళ్లు
ఆగుపించరే ఎందుకో!
వేకువ కోసం తూరుపు
వేచి చూచి ఎర్రబడ్డ కారణమేమో?
వేయి కిరణాలతో హిరణ్మయుడు
వేడుకగా బుగ్గ తాకేనేమో!
అంబరపు సంబరాలు కన్న
అవని నిలిచి చూసేనేమో
అబ్బురముగా తోచి
అరుదెంచు వేలుపు రాకకై!
చీకటికి తావు లేక ఇలపై
చాటున వేచి మాటు వేయగా
పరుగు పరుగున కదిలి
పడమటికి పారిపోయి దాగెనేమో!
పుత్తడి వెలుగుల పుడమి
కొత్త అందాలతో మెరిసి
నింగి నిలువుటద్దాన సొగసు
రంగులీనగ చూచి మురిసేనేమో!
జగానికి చైతన్యము నిచ్చి
ఉదయాన్ని కానుకగా తెచ్చి
జాగృతమై మెలగమని
హెచ్చరిస్తూ నడిపించు వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి