ఊషన్నపల్లి పాఠశాలకు ఫ్యాన్ల వితరణ

 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆ గ్రామానికి చెందిన ముస్కు శ్రీనివాస్ అనే బ్యాంకు ఉద్యోగి 3 ఫ్యాన్లను అందజేశారు. గురువారం ఆయన ముస్కు సతీష్, ముస్కు మధుకర్, ముస్కు తిరుపతిలతో కలిసి పాఠశాలకు విచ్చేసి ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. పాఠశాలకు ఫ్యాన్లు అవసరం ఉన్నాయని స్థానికులు  ముస్కు సతీష్ ముస్కు మధుకర్లకు ప్రధానోపాధ్యాయులు తెలియజేయడంతో స్పందించిన వారు తమ దగ్గర బంధువైన ముస్కు శ్రీనివాస్ ద్వారా ఈ ఫ్యాన్లు ఇప్పించారు. పాఠశాలకు ఫ్యాన్లు అందజేసిన దాత శ్రీనివాస్ అందుకు సహకరించిన సతీష్, మధుకర్ల కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ లు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ  ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి గ్రామస్తులు, దాతలు పలువురు ఆర్థికంగా, వస్తురూపెనా సహాయం చేయాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం తోటే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత ముస్కు శ్రీనివాస్, సతీష్ మధుకర్, తిరుపతి, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు