మన అందరి చిన్ని కృష్ణ:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
జయ జయ జయ ఓ కృష్ణ
జయ విజయీభవ శ్రీకృష్ణ
 రాగం వినిపించ రారా కృష్ణ
 భోగం జరిపించ లేవా కృష్ణ ?

జయహే జయహే జయ కృష్ణ
ఓహో ఆహా ఆలమంద కృష్ణ
చిల్లర మల్లర అల్లరి మా కృష్ణ
చిన్నారి పొన్నారి మా శ్రీకృష్ణ !

జయ జయ జనరంజన కృష్ణ
దిగ్విజయీభవ వైభవ శ్రీకృష్ణ
మురిపాల మా ముద్దుల కృష్ణ
సరసాల సిరిగల ఓ మా కృష్ణ !

జయ జయ జయ మంగళ కృష్ణ
దిగ్విజయీభవ పింగళి ఓశ్రీకృష్ణ
 ముద్దు మురిపాల మురళీకృష్ణ
 సుద్దుల హద్దుల మా హరికృష్ణ !

జయహో జయహో జనార్ధన కృష్ణ
విజయీభవ దిగ్విజయీభవ కృష్ణ 
ఆనందం పంచే మా అందాల కృష్ణ
సుందర నందన సురభిల శ్రీకృష్ణ !

జయ జయ జయహే మా కృష్ణ
దిగ్విజయీభవ జనప్రియ కృష్ణ
ఆనంద తాండవం ఆడే శ్రీకృష్ణ
అనుబంధ బంధం పెంచే కృష్ణ !

జయ విజయీభవహే మా శ్రీకృష్ణ
జయ బుధ జన ప్రియమణి కృష్ణ
నెమిలి పించం కలిగిన ఉమాకృష్ణ
కలిమిని పెంచిన కలియుగ శ్రీకృష్ణ!

జయ జయ జయ శ్రీ రంగం కృష్ణ
జయహే జయహే శ్రీ గంధం శ్రీకృష్ణ
గోవర్ధనగిరి నెత్తిన మాగోకుల కృష్ణ
ఆ బాలగోపాలం ఆనందాల శ్రీకృష్ణ

గోపికలందరి బృందావన కృష్ణ
గోకుల సుందర నందన శ్రీకృష్ణ
బలే బ లే బాహుబలే బాలకృష్ణ
ఒలే ఒలే వనమాలి వంశీకృష్ణ. !

జయ జయ జయ  జావలి కృష్ణ
జయ విజయీభవ దీపావళి కృష్ణ
ఆనంద హేళను అందించిన కృష్ణ
సునంద బాలను సృజించిన కృష్ణ 


కామెంట్‌లు