మిమ్మల్ని మీరు పునర్ నిర్వచించుకోండి:- అంకాల సోమయ్య--దేవరుప్పుల-జనగామ9640748497
కాలహరులారా!
బద్దకానికి
తోబుట్టువులారా!
తల్లిదండ్రులకు
తలనొప్పిగా మారిన
ఆకతాయిలారా...!?

తప్పును ఒప్పుని వాదించే
తప్పుడు మనుషులారా..!?
సామాజిక స్పృహలేని
ప్రగతిశూన్యులారా...!?

దిశదశాలేని చైతన్యహీనులారా!
పరాన్న జీవనం గడుపుతున్నం
పరాన్నబుక్కులారా!

నీతి నియమాలు
తలకెక్కించుకోని
పొగరుబోతులారా!
భూభారతికి భారమై
బ్రతుకుతున్న చరిత్ర హీనులారా..!

ప్రళయమొచ్చిన
విలయం సంభవించిన
పట్టని
అచేతనులారా!

పుట్టుక ఎందుకోతెలుసుకోలేని
పాషాణ హృదయులారా!
పరిశ్రమ
పురోగతి
సాధికారత
సమసమాజం
సమైక్యతాగీతం
నిత్య పారాయణ చేయండిరా!
మిమ్మల్ని మీరు పునర్ నిర్వచించుకోండి
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని 
ఆత్మగౌరవాన్ని
కల్గియుండి
ఈ జగత్తుకు (మీరే)నువ్వు దిక్సూచి కావాలి
సంపూర్ణ మూర్తిమత్వవికాసానికై
నీతి నియమాలు పాటించు
శ్రమజీవనసౌందర్యాన్ని ఆరాధించు


కామెంట్‌లు