దండిస్తాడు .అనే భావన మరచినేడు గురువులు పాఠశాలల్లో విద్యార్థులను కొట్టేటట్టులేదుకానీ వినూత్న రీతిలో బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులను మెరికల్లా తయారుచేయాలి.విభిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు వారి వారి కుటుంబ నేపథ్యాన్ననుసరించి క్రమం తప్పకుండా బడికివారురారు .వచ్చిన రోజు ఉపాధ్యాయుల బోధనాకు అడ్డుతగలడంచెప్పేపాఠం వినకుండా వెకిలి చేష్టలు కొంటెపనులు చేయడంతాచెడ్డ కోతివనమంతా చెరచెనన్న చందంగామిగతా విద్యార్థుల అవధానానికి భంగం కలిగిస్తాడు .ఒకటిరెండు సార్లు మందలించిన అతడి తుంటరి పనులు మానుకోకపోవడంతో బెత్తంతో ఒక దెబ్బకొడతాడు.అది పెద్ద నేరమైనట్టువిద్యాహక్కుచట్టం ప్రకారం విద్యార్థులెవరినైనా దండించరాదుఅనే అంశంపై సదరు ఉపాధ్యాయుడిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తారు.ఈ పద్దతి మూలంగా ఉపాధ్యాయులు ఇంటా బయటా వృత్తిలో ఒత్తిడి పెరిగి బీపీ షుగర్ లాంటి జబ్బులతో భారంగా రోజులు గడుపుతున్నారు.తన చిన్ననాడు తమ గురువులు ఎన్నిసార్లు కొట్టిన ఏ ఒక్కరోజు మా తల్లిదండ్రులు బడి కొచ్చి మా అబ్బాయిని ఎందుకు కొట్టారనిఏ ఒక్కనాడు అడిగిన దాఖలు లేవుపంతులు కొడుకైన తొడపాశంపెడితేనే చదువు వస్తదనెటోళ్ళు.మా సార్ కొడుకును కూడా చదువకుంటే మా ముందే బెత్తంతో కొట్టె వారు.కానీనేడు ఆ సంస్కృతి ఎక్కడిది. గురువు అంటే భక్తిశ్రద్ధలులేవు.కరోనా కన్న ముందు తర్వాత విద్యార్థుల విద్యావిషయక ప్రగతిని మూల్యాంకనం చేయుటకుస్మార్ట్ ఫోన్ లో ఆన్లైన్ తరగతులు నిర్వహించారువిద్యార్థులందరికిస్మార్ట్ ఫోన్ లు కొనిచ్చారు దాంతో విద్యార్థులు ఫోనుకు బానిసైనవైనంఈ రోజుల్లో ఉపాధ్యాయులు అంటే ఒక పాయింటర్ మాత్రమేకొందరు టీచర్లెతే ఊరుకుంటాడు వాడు ఉత్తముండు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.నేడు స్మార్ట్ క్లాస్ రూమ్, డీజీ తరగతులు మూలంగా ఉపాధ్యాయులు రేపటి రోజునఇప్పుడు ఉన్నంత మంది గూడా అవసరం ఉండకపోవచ్చు .దీంతో నేటి ఉపాధ్యాయులు కొంత మంది వీఆరెస్మిగతా కొంత మంది ఉపాధ్యాయులు అప్డేట్ స్మార్ట్ క్లాస్ రూమ్ విద్యాబోధన, మరియు ఆన్లైన్ క్లాస్ లు ఎలా నిర్వహించాలి మరియు కంప్యూటర్ పాఠాల తయారీ మొదలైన అంశాలపై అవగాహన లేకపోవడం ఉన్న ఉద్యోగం ఉంటుందోఊడుతుందోనన్న దిగులు పట్టుకుంది.ఈనాటి కాలంలో విద్యాబోధన ఉపాధ్యాయులకు కత్తిమీద సాము వంటిది,విద్యార్థులను మందలించ కూడదుకానీఅత్యుత్తమ ర్యాంకులు సాధించాలన్నట్టుందిఒకనాడు ఉపాధ్యాయులు అంటే సామాజిక గౌరవం ఉండేది.నేడు అగౌరవమర్యాదలు లేనేలేవుఇన్ని ఆంక్షలతోనుఎంతోకొంత ఫ్యూచర్ జనరేషన్ విద్యార్థినీ విద్యార్థులను ఉద్దరించాలని చూడడం అది ఎండమావి లో నీరు వెతకడంలాంటిదే .ఇదిపోను సామాజిక సర్వేలను.ఎలక్షన్ డ్యూటీలుమొదలగు వాటివల్ల ఉపాధ్యాయులకే అప్పగించడం మూలంగా ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు.బడి అంటే సమాజంలో ఒకభాగం.అటువంటి బడి పంతుళ్లను ఆదర్శప్రాయులుగామార్గదర్శకులుగా చూడవలసిన బాధ్యత ఇటు విద్యార్థులపైనుంది మరియు మన చుట్టూ ఉన్న పౌర సమాజంపైనుంది .అందుకే అన్నారు గురువు లేని విద్య గుడ్డి విద్యవిద్యావిహీనామ్ పశువుఃగురువుకు మునుపటి గౌరవమర్యాదలను ఇద్దాంతల్లిదండ్రులు తర్వాత స్థానమైన గురువును నిత్యం పూజిద్దాంమనం అనుకున్న లక్ష్యాలను ఛేదిద్దాం
గురువులను గౌరవిద్దాం :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి