ఆలోచన సరళి బాగుండాలి!:- -గద్వాల సోమన్న,-9966414580
సరికొత్త రోగాలకు
దారి దురాలోచనలు
చీదపురుగు లాంటివే!
పాడు చేయును మనసులు

మంచి ఆలోచనలే!
చేయును ఉత్తమ పౌరులు
సమాజాన్ని ఉద్ధరించు
ఘన ఆదర్శ పురుషులు

బలమైన ఆలోచనలు
ఏదైనా సాధించును
చరిత్రను తిరిగి రాసే
తలపెట్టును గొప్ప పనులు
 
సరైన ఆలోచనలు
ఇచ్చును సత్ఫలితాలు
లేకుంటే జీవితాలు
అవుతాయి తలక్రిందులు

శక్తి గలవి యోచనలు
భవితకవే పునాదులు
ఆత్మ పరిశీలన చేయి!
ఇక బ్రతుకు వెన్నెల రేయి


కామెంట్‌లు