చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

*మాలిని*


గడిచిన నడకెంతో కందిపోకుండ నిండున్
తడబడని గతంబే తృష్ణగానిల్చి మాటల్
వడివడిగను కాంతుల్ వత్సరంబందు పంచన్
గడబిడగ దినంబుల్ కాలమేదైన సాగున్
*కందం*
నిన్నటి రోజు నినాదము
వెన్నుగ మదినందెపుడును బిగుసును బాటల్
కన్నుల వత్సరకాంతులు
దన్నుగ నిలువ మదినందు తాండవమాడున్

 
కామెంట్‌లు