ఏ గాలికి కరిగిన మేఘమో!
ఏ మబ్బున దాగిన చినుకో!
ఏ గిరుల జారిన వానో!
ఏ వాగుగా మారిన ధారో!
వడిగా పరుగులు తీసి
కలివిడిగా పాయల కలిసి
నిలువుగా లోయల సాగే
జలధారది ఎంత వేగం!
నురగలు గక్కుతూ
ఉరకలు వేస్తూ దూకి
పాడి ఆవు పొదుగున ఊరే
పాలధారను బోలిన తెలుపై...
తొలి కిరణపు వెలుగులలో
సిరి బంగరు కాంతులు చిందే
దివిజ గంగ భువికి దిగివచ్చే
భవ్య వీక్షణ భాగ్యము వరమే!
చినుకుల రవ్వలు
చిందరవందరగా చిమ్ముతూ
హోరును గాలిలో కలిపి
జోరుగా నేలను తాకే
జలపాతపు హొయలును
కనుల ముందు వీక్షింప
కలానికి వీలుగా వర్ణింప
పదములు వెదుకగ దొరికేనా?
కొన్ని భావాలు కొన్ని దృశ్యాలు
కొన్ని ఆనందాలు కొన్ని అద్భుతాలు
అభివర్ణించజాలము
అనుభవించాలి అంతే!
అలాటి అద్భుతమే అయిన
సూర్యోదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి