భక్త తులసీదాస్....అచ్యుతుని రాజ్యశ్రీ



 అందరం హనుమాన్ చాలీసా చదువుతాం కానీ దాన్ని రచించిన వారు హిందీ కవి తులసీదాస్. రామచరితమానస్ రాసిన భక్త కవి.ఒకసారి ఆయన స్నానానికి బైలు దేరాడు. నదిలో పడి చావాలని ఓఅంధుడు కాలు పెట్టబోతుంటే " నాయనా! ఎదురుగా నది అలలు ఎగిసిపడుతున్నాయి.కళ్లతో బాగా చూసుకుని నడు" అని తులసీదాస్ అనగానే అతనికి వెంటనే కంటిచూపు రావడం ఆయన కాళ్లపై పడ్డాడు.ఈవిషయం మొగల్ పాదుషాకి తెలిసింది.వెంటనే తులసీని పిల్పించి" ఏంటీ గారడీలు మాయలు మంత్రతంత్రాలు చేస్తున్నావు? ఇప్పడు చూపు నీమాజిక్" అని అంటే ఆయన " నేనురామభక్తుడ్ని.నాకు తంత్రాలు గారడీలు తెలీవు" అనగానే అహంకారంతో పాదుషా కొరడాలతో కొట్టిస్తాడు.తులసీదాస్ వెంటనే హనుమాన్చాలీసా అప్రమత్తత తో భక్తితో ఆశువుగా చదవడం మొదలుపెట్టారు.అంతే ఎక్కడెక్కడ నించో వేలాదికోతులు వచ్చి రాజప్రాసాదాల్ని ఆక్రమించి జనాల్ని భయపెట్టడంతో పాదుషా గడగడ వణుకుతూ ఆయన పాదాలపై పడ్డాడు.ఆశ్చర్యం!తుండు తుపాకీ లేకుండ కోతులన్నీ మరుక్షణం మాయమైనాయి. తులసీదాస్ పల్లెత్తుమాట అనలేదు.రామస్మరణ తో హనుమాన్ చాలీసా పారాయణ తో తరించి మనకు అందించిన మహాకవి.పిల్లల కి తప్పక చాలీసా నేర్పి ధైర్యం విశ్వాసం కల్గించాలి. హనుమ గొప్ప తనం భక్తి నేడు పరీక్షల టైంలో ముఖ్యం.మాటలు వస్తున్న దశలో నేర్పితే 5వక్లాసు కల్లా వారు హనుమాన్ చాలీసా నేర్చుకుంటారు.ఇది అమ్మ నాన్నల ధర్మం🌷
కామెంట్‌లు