తానెంతో ప్రేమిస్తూ ఉంటాడు
దేశాన్ని,నన్ను.
తానెంతో గౌరవిస్తూ ఉంటాడు.
అమ్మా,నాన్నలను,
మాతృభూమిని.
తానెంతో పోరాడుతూ ఉంటాడు
మాతృదేశం కోసం.
తానెంతో కోల్పోతూ ఉంటాడు
వ్యక్తిగత జీవితాన్ని.
తానెంతో స్ఫూర్తినిస్తూ ఉంటాడు
తన చుట్టూ ఉన్నవారికి.
తానెంతో బలాన్నిస్తూ ఉంటాడు
తన పటాలానికి.
నిత్యం చచ్చిబతుకుతుంటాడు కానీ,తానే హిమాలయమై నిల్చుంటాడు.
ఆఖరికి తాను కీర్తిశేషుడైనా గానీ,
తన ఆత్మతో నిత్యం సంభాషిస్తూనే ఉంటాను.
తన కీర్తిచక్రాలను
భరతమాతకర్పిస్తాను.
తన జ్ఞాపకాలే జీవికలుగా
తన విజయాలను నెమరువేసుకుంటాను.
తన దేశభక్తిని స్మరిస్తూ,
తనని శ్వాసిస్తూనే ఉంటాను.
భార్యగా జీవచ్ఛవమైనా,
సైనికుడి సోల్ మేటుగా
బతికే ఉంటాను.
దేశచరిత్రలో తనతో నిలిచి
శాశ్వతమవుతాను.
తాను లేడనే బాధ తప్ప,
తానిచ్చిన ప్రేమను అహర్నిశలు అనుభూతి చెందుతూనే ఉంటాను.
త్రివర్ణపతాకం చూసినప్పుడల్లా
తన మోమును గాంచి,
తృప్తి చెందుతూనే ఉంటాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి