బెజవాడ రాజబాబు -
తాతంటే ....
బెరుకులేదు 'నికో '..కి ,
చూస్తేచాలు ...ఎందుకో
చేతులు పైకెత్తి ....
చంక నెక్కుతాడు ....!
తాతను ...
ఆనందంలో ముంచుతాడు
చెప్పలేని సంతోషం ...
పంచుతాడు ...!
పిల్ల లెందుకో-కొందరిని
తెగ ఇష్టపడతారు...
కొత్త -పాతల -
సంబందం లేకుండానే ,
చేరువైపోతారు.....!
రక్తసంబంధాల బంధాలు ,
ఎవరు వేరుచేయగలరు ?
తల్లి మేనమామ ...ను
ప్రేమించని దెవ్వరు !?
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి