ఊరుగాలి ఈల 54:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మట్టిగాలి పరవశంలో పరిమళించే ఎద పల్లెసీమ
చిట్టిపొట్టి చిన్నారి పల్లే సుందరం నేలగాలి ఈల
పంతుళ్ళ బడి సెలవు కేరింత పిల్లలే మాఊరు

కొండంత దీపం ఊరు వెలుగు పగలు రాత్రి 
మట్టినేల శయ్య నులక మంచాలు నిద్ర కిర్రుకిర్రు 
పూల అందాల దండలు దర్వాజలకేయ ప్రభఊరు

ఆలయాల పూజల దైవ దీవెన పొందు పల్లెశాంతి
పరువాల సరసాలు మిర్రిచూసే కనుల ఊరుప్రీతి
ఊరంత ఒకచోట కలసే పగలు క్షేమాల వినే నేల

అమ్మ ఊరైనా అత్త ఊరైనా కొత్త కోడలే సంక్రాంతి
ఆటపట్టించే బావలు వదినమరదళ్ళు లతలూగే
కులముల వృత్తి సామాను పల్లే పసుల పూజభోజ

ఆంబోతు రంకెలు ఆలమంద పరుగు నవ్వేపల్లె
పెద్దల మర్యాద పిల్లల మమతలు కలిసి ఆడేనేల
అవని స్వర్గసీమ ఉంటెగింటే ఊరుగాక వేరే లేదు

నగరమే దిగివచ్చే ఊరు సంక్రాంతి కోడిపందెం
కోలాటమే సుదతి చిరుతలరాణి దరువు ఊరు
అమలిన శృంగారవీధి చతురాంగనల నాట్యం

పల్లేసీమల యువతీయువకుల క్రీడ శ్రీనాధ సేత
తేట తెలుగు వెలిసే తెలంగాణ కవి పాల్కుర్కి కైత
పల్లా దుర్గయ్య కావ్యమే గంగిరెద్దులాడే సంక్రాంతి
==================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు