ఊరుగాలి ఈల 68:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
బహుళ కళల వెలిగే సేవలు ఒక శక్తిలో మాఊరు
సాధుజీవి వేదస్ఫూర్తి పద్యమైన సంఘజీవి పద
అమ్మ తోడునీడ నాయిన ఊరు సేవలందే చూపు

పరుల సేవల దేలి పిల్లల వీడే నిస్వార్థ కృషి ఊరు
పట్వారీ పని దిట్ట కఠతః కొలతలు రాతపూతే ఫ్రీ
గొలుసు కొలతల భూమి చిక్కు విప్పిన పల్లె గొప్ప

ఆశపడని మనసు ఆశించని ఎద కవి పద్య గతి
ఛందస్సు కందసీసాలు ఇంపారగా చెప్పే ఆశుకవి
ఉచ్ఛారణ దోషము ఒప్పని గొంతు మరల నేర్పేశక్తి

గీత కావ్యప్రబంధాలు కథనవలలే చదివే  ఊరు
మంచి చెడు ముహూర్తమే నేర్చె పల్లె బాగు చెప్పే
ప్రశ్న చెప్పన్నచో గణణచేసి దారిచూపే పల్లె హితైశి

కట్టుబాట్లు లేవు గిట్టుబాట్లు లేవు నది నడకేఊరు
మనిషి మాటా నడకా ఒకటే ఊరు దయామయి
చైతన్య శిఖరం గురువైన మార్పే ఊరు స్పందన

సలహాలు ఓదార్పులు తీర్పులు నేర్పే కళే ఊరు
ఆశ నిరాశచెందని మాటే మనీలేని గుండే ఊరు
ఒక్కరికోసం ఊరంతా మనకై నిలిచేదేలే ఊరు

చదువు ప్రాణం మాట జీవం మనిషి కలిస్తే ఊరు
సంత సంతసం తీర్థం పరమార్థం మనిషే ఊరు
మానవతాధార మరువలేని మనిషి ఎగిసే ఊరు

------------------------------------------------
(ఇంకా ఉంది)

కామెంట్‌లు